Support & Downloads

Quisque actraqum nunc no dolor sit ametaugue dolor. Lorem ipsum dolor sit amet, consyect etur adipiscing elit.

s f

Contact Info
198 West 21th Street, Suite 721
New York, NY 10010
foton@qodeinteractive.com
+88 (0) 101 0000 000
Follow Us

మీ జుట్టుకు సరైన మైల్డ్ షాంపూన్ ఎలా ఎంచుకోవాలి?

మన జుట్టు ఆరోగ్యానికి షాంపూ ఎంపిక చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఉపయోగించే షాంపూలో హార్ష్ కెమికల్స్ ఉంటే, జుట్టు రేగడం, డ్రైనెస్, హెయిర్ ఫాల్ వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే మైల్డ్ షాంపూన్ ఉపయోగించడం మంచిది. కానీ, సరైన మైల్డ్ షాంపూన్ ఎలా ఎంచుకోవాలి? ఈ బ్లాగ్ లో, మీ జుట్టుకు సరిపోయే షాంపూన్ ఎంపిక చేసుకోవడానికి కొన్ని టిప్స్ తెలుసుకుందాం. 

మైల్డ్ షాంపూ అంటే ఏమిటి?
మైల్డ్ షాంపూలు సాధారణంగా సల్ఫేట్-ఫ్రీ, పారాబెన్-ఫ్రీ మరియు ఇతర హానికరమైన కెమికల్స్ లేకుండా తయారు చేయబడతాయి. ఇవి జుట్టు ప్రకృతి తైలాలను కాపాడుతూ, స్కాల్ప్‌ను శాంతింపజేస్తాయి. ముఖ్యంగా సెన్సిటివ్ స్కాల్ప్, డ్రై హెయిర్ లేదా కలర్ ట్రీటెడ్ హెయిర్ ఉన్నవారికి ఇవి బాగా సరిపోతాయి. 

మీ జుట్టుకు సరైన మైల్డ్ షాంపూన్ ఎంచుకోవడానికి టిప్స్

1. మీ జుట్టు రకాన్ని గుర్తించండి
ముందుగా మీ జుట్టు ఏ రకానికి చెందినదో తెలుసుకోండి: 
డ్రై హెయిర్ అయితే హైడ్రేషన్ మరియు మాయిస్చరైజింగ్ ఇచ్చే షాంపూలు ఎంచుకోండి. 
ఒకవేళ ఆయిలీ హెయిర్ గనుక అయితే సాఫ్ట్ క్లియన్సింగ్ ఏజెంట్స్ ఉన్న షాంపూలు ఉపయోగించండి. 
సెన్సిటివ్ స్కాల్ప్: సూక్ష్మ జీవాణువులను ప్రేరేపించని, ఇరిటేషన్ తగ్గించే షాంపూలు ఎంచుకోండి. 

కలర్ ట్రీటెడ్ హెయిర్:కలర్ ప్రొటెక్షన్ ఇచ్చే మైల్డ్ ఫార్ములా షాంపూలు ఉపయోగించండి. 

2. మంచి మైల్డ్ షాంపూలో ఈ క్రింది పదార్థాలు ఖచ్చితంగా ఉండాలి: 
నేచురల్ ఓయిల్స్ (జోజోబా, ఆర్గన్, కొబ్బరి నూనె) 
హెర్బల్ ఎక్స్‌ట్రాక్ట్స్ (ఆలోవెరా, హిబిస్కస్, నీలిమందారం) 
ప్రొటీన్-ఎన్రిచ్డ్ (కెరాటిన్, వీట్ ప్రొటీన్) 

మీరు వాడే షాంపూ లో  క్రింది పదార్థాలు  లేకుండా ఉండాలి : 
– సల్ఫేట్స్ (SLS/SLES) 
– పారాబెన్స్ 
– సిలికోన్స్ 
– ఆర్టిఫిషియల్ ఫ్రెగ్రెన్స్ 

3. pH బ్యాలెన్స్ షాంపూన్ ఎంచుకోండి
జుట్టు మరియు స్కాల్ప్ యొక్క సహజ pH (5.5) కు దగ్గరగా ఉండే షాంపూలు ఎంచుకోండి. ఇది స్కాల్ప్ ను హైడ్రేట్ చేసి, హెయిర్ ఫాల్ ను తగ్గిస్తుంది. 

4. బ్రాండ్ రిప్యుటేషన్ మరియు రివ్యూలు
నమ్మకమైన బ్రాండ్‌ల నుండి మాత్రమే షాంపూన్ కొనండి. ఆన్‌లైన్ రివ్యూలు చదివి, ఇతర వినియోగదారుల అనుభవాలు తెలుసుకోండి. 

5. ప్యాచ్ టెస్ట్ చేయండి
కొత్త షాంపూన్ ఉపయోగించే ముందు, చిన్న పరీక్షగా స్కాల్ప్ యొక్క చిన్న భాగంలో ప్యాచ్ టెస్ట్ చేయండి. ఇరిటేషన్ లేదా అలెర్జీ లేకుంటే మాత్రమే ఉపయోగించండి. 

ఉత్తమ మైల్డ్ షాంపూల బ్రాండ్స్ (ఇండియా లో)
1. Mamaearth Onion Shampoo – హెయిర్ ఫాల్ కోసం. 
2. Wow Skin Science Apple Cider Vinegar Shampoo – స్కాల్ప్ డిటాక్సిఫికేషన్ కోసం. 
3. Khadi Natural Herbal Shampoo – ఆయుర్వేదిక్ ఫార్ములా. 
4. The Body Shop Ginger Shampoo – సెన్సిటివ్ స్కాల్ప్ కోసం. 
5. ILÉM Japan Moisturizing Shampoo – డీప్ హైడ్రేషన్ కోసం. 

చివరిగా..
మైల్డ్ షాంపూన్ ఎంచుకునేటప్పుడు మీ జుట్టు రకం, స్కాల్ప్ సున్నితత్వం మరియు షాంపూలోని పదార్థాలను బాగా పరిశీలించండి. సరైన షాంపూన్ ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యంతో పాటు, కాంతి మరియు మృదుత్వం కూడా పెరుగుతాయి. 


Post a Comment